మూడో భార్య చెప్పిందని.. ఏడేళ్ల కుమారుడుని వీడియో తీస్తూ హత్య చేసిన తండ్రి

by Disha Web Desk 12 |
మూడో భార్య చెప్పిందని.. ఏడేళ్ల కుమారుడుని వీడియో తీస్తూ హత్య చేసిన తండ్రి
X

దిశ, వెబ్‌డెస్క్: తన ఏడేళ్ల కుమారుడిని గొంతు నులిమి హత్య చేసిన కేసులో పరారీలో ఉన్న 26 ఏళ్ల వ్యక్తిని అతని మూడో భార్యతో కలిసి మంగళవారం అరెస్టు చేసినట్లు ఇండోర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముండే అనే వ్యక్తి మొదటి, రెండో భార్యలు చనిపోవడంతో మూడో భార్యను పెళ్లి చేసుకున్నాడు. కాగా మొదటి భార్యతో అతనిక ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. అలాగే మూడో భార్య పాయల్ మూడు నెలల క్రితం తన తల్లీగారిట్లో మగబిడ్డకు జన్మనిచ్చింది.

దీంతో ఆమెను తీసుకురావడానికి వెళ్లిన ముండేకి మూడో భార్య.. కండిషన్ పెట్టిందని.. మొదటి భార్య కొడుకు ఉంటే తాను ఇంటికి రాను అని చెప్పిందని.. అతన్ని ఎక్కడికైనా తీసుకెళ్లి వదిలేయ్ లేదా.. చంపేయ్ అని పాయల్ చెప్పింది. దీంతో తాను.. తన ఏడేళ్ల కుమారుడిని గొంతు నులిమి హత్య చేశాడు. హత్యకు సంబంధించిన వీడియోను తన ఫోన్ లో రికార్డ్ చేసి మూడో భార్య అయిన పాయల్‌కు పంపినట్లు తెలిపాడు. కానీ పాయల్, ముండే మధ్య గొడవల కారణంగా ఆమె అతని నెంబర్ బ్లాక్ చేసింది. దీంతో ఆమె ముండే పంపిన వీడియో ని చూడలేక పోయింది. అయితే వీడియో ఆధారంగా ఇద్దరిని అరెస్ట్ చేయగా.. తాను బాలుడుని చంపమని చెప్పలేదని.. తనకేమీ తెలియదని పోలీసులతో చెప్పుకొచ్చింది.

Next Story

Most Viewed