Father Suicide: యువతికి వేధింపులు.. తండ్రి ఆత్మహత్య

by Naga Rani Yarlagadda |

రైల్వే హెడ్ కానిస్టేబుల్ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాలకు చెందిన 34 ఏళ్ల వ్యక్తి కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని 16 ఏళ్ల కుమార్తె స్థానిక స్కూల్ లో చదువుకుంటోంది.

Father Suicide: యువతికి వేధింపులు.. తండ్రి ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: తన కుమార్తెను ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తుండటాన్ని భరించలేక.. మనోవేదనతో ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గద్వాల రైల్వే పోలీస్ స్టేషన్ (Gadwal Railway Police Station) పరిధిలో బుధవారం జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాలకు చెందిన 34 ఏళ్ల వ్యక్తి కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని 16 ఏళ్ల కుమార్తె స్థానిక స్కూల్ లో చదువుకుంటోంది. అయితే.. గద్వాలకు చెందిన వినోద్ అనే యువకుడు ఆమెను ప్రేమపేరుతో వేధిస్తున్నాడు. దీంతో కూతుర్ని చదువు మాన్పించేశారు. తమ కూతురి వెంట పడొద్దని వినోద్ ను హెచ్చరించారు. అయినా అతని తీరు మారకపోగా.. వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. దాంతో యువతి తండ్రి మనోవేదనకు గురై వెంకంపేట శివారులో రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story