కూతుర్ని వదలడానికి వెళ్తూ.. తండ్రి మృత్యువాత

by Bhanu |   (  Updated:2025-07-21 05:35:33  IST  )

బాసర రైల్వే స్టేషన్‌లో కూతురిని వదిలి పెట్టడానికి బయలుదేరిన తండ్రి ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

కూతుర్ని వదలడానికి వెళ్తూ.. తండ్రి మృత్యువాత
X

దిశ, భైంసా: తన కూతురుని హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ ఎక్కియ్యడానికి,తండ్రి తన ద్విచక్ర వాహనంపై బాసర రైల్వే స్టేషన్ వెళ్ళే క్రమంలో అదుపుతప్పి ద్విచక్ర వాహనానికి ప్రమాదం సంభవించగా తండ్రి అక్కడికక్కడే మరణించిన ఘటన సోమవారం వేకువజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాదులో విద్యనభ్యసిస్తున్న కూతురు డి.నిఖిల నీ కుబీర్ మండల కేంద్రానికి చెందినటువంటి తండ్రి రిటైర్డ్ ఆర్మీ దొంతుల గణేష్ (43) సోమవారం వేకువజామున బాసర రైల్వే స్టేషన్ లో దిగబెట్టడానికి వెళ్ళే క్రమంలో భైంసా మండలం దేగాం గ్రామ సమీపాన గల బ్రిడ్జి వద్ద అదుపుతప్పి ద్విచక్ర వాహనం బోల్తాపడంది.

దీంతో తండ్రి కూతురూ ఇద్దరు బ్రిడ్జి కింద పడిపోయారు.తండ్రి గణేష్ అక్కడికక్కడే మరణించగా.. కూతురు నిఖిలకి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. తండ్రి గణేష్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించగా, కూతురు నిఖిల బైంసాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. మృతుడు గణేష్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటన తెలుసుకున్న బంధువులు, సన్నిహితులు శోకసంద్రంలో మునగగా,ప్రస్తుతం కుబీర్ గ్రామంలో విషాదఛాయలు అములుకున్నాయి.

Next Story