- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆకలితో రైల్వే రిటైర్డ్ ఎంప్లాయ్ మృతి.. కూతుర్ని అలా చూసి షాకైన బంధువులు
ఓం ప్రకాశ్ రాథోడ్ (70) రైల్వేలో సీనియర్ క్లర్క్ గా పనిచేశారు. 2015లో రిటైర్డ్ అవ్వగా, 2016లో ఆయన భార్య మరణించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆయన రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్. ఒక్కగానొక్క కూతురు. తామిద్దరినీ చూసుకునేందుకు ఓ జంటను కేర్ టేకర్లుగా పెట్టుకోవడమే వారిపాలిట శాపమైంది. తండ్రితో పాటు, మానసిక వికలాంగురాలైన కూతురిపట్ల కూడా దారుణంగా ప్రవర్తించారు. ఇంట్లోనే ఇద్దరినీ నిర్బంధించడంతో.. ఆ తండ్రి ఆకలితో మరణించగా, కూతురి పరిస్థితి కూడా దారుణంగా మారింది. ఈ పాశవిక ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహోబా జిల్లాకు చెందిన ఓం ప్రకాశ్ రాథోడ్ (70) రైల్వేలో సీనియర్ క్లర్క్ గా పనిచేశారు. 2015లో రిటైర్డ్ అవ్వగా, 2016లో ఆయన భార్య మరణించింది. కూతురు రష్మీ మానసిక వికలాంగురాలు. ఆమె బాగోగులు చూసుకుంటూ మహోబాలోనే నివాసం ఉంటున్నారు. వంట చేయడం రాకపోవడంతో.. రాంప్రకాశ్, రమాదేవి దంపతులను కేర్ టేకర్లుగా నియమించుకున్నారు. వారి నిస్సహాయ పరిస్థితుల్ని గమనించిన వారు.. ఓం ప్రకాశ్, రష్మీలను వేర్వేరు గదుల్లో నిర్బంధించారు. పైగా బంధువులు చూడటానికి వెళ్లినప్పుడల్లా ఎవరినీ కలిసేందుకు ఇష్టపడటం లేదని చెప్పేవారు. ఆ జంట పెట్టిన టార్చర్, ఆకలి బాధను తట్టుకోలేక ఓం ప్రకాశ్ ఈమధ్యకాలంలో మరణించారు.
విషయం తెలుసుకున్న బంధువులు ఇంటికి వెళ్లగా.. అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి ఖంగుతిన్నారు. మరణించిన ఓం ప్రకాశ్ శరీరం కృశించిపోగా.. రష్మీ ఎముకలగూడులా మారి.. ఓ చీకటిగదిలో ఉంది. 30 ఏళ్ల రష్మీ 80 ఏళ్ల వృద్ధురాలిగా మారిందని, ఆమె శ్వాస తీసుకుంటుంటే అస్థిపంజరం శ్వాస తీసుకున్నట్లుగా కనిపిస్తోందని బంధువులు వాపోయారు. ఎంతో హుందాగా బ్రతికిన ఆ కుటుంబం ఇలా అవ్వడాన్ని చూసిన స్థానికులు.. కేర్ టేకర్లుగా వచ్చిన జంటే దీనంతటికీ కారణమని వాపోయారు. డబ్బు, ఆస్తికోసం ఇంతకు తెగించారని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఇంటి కరెంట్ కనెక్షన్ ను రాంప్రకాశ్, రమాదేవిలు తమ పేరుమీదికి మార్చుకున్నట్లు గుర్తించారు. ఓం ప్రకాశ్ పోస్టుమార్టంలో ఊపిరితిత్తుల సమస్యతో చనిపోయినట్లు తేలిందని, పూర్తి దర్యాప్తు తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.






