Crime: మరో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఆరుగురు దుర్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-20 13:23:56  IST  )

రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో

Crime: మరో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఆరుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇవాళ ఉదయం 7 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నదియా జిల్లా కృష్ణా నగర్ - కరిమ్‌పూర్ రహదారిపై కాఠాలియా గ్రామ శివారులో మారుతి వ్యాన్, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో మారుతి వ్యాన్‌లో ఉన్న మొత్తం ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక ఏసీ బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో ఏడుగురికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు మృతదేహాలను మారుతి వ్యాన్ నుంచి బయటకు తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం అక్కడి నుంచి తరలించారు. ఇక గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. మృతుల కుటుంబ సభ్యుల సమాచారం మేురకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.

Next Story