ORR Accident : ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

by Muthe.Rajitha |

మేడ్చల్(Medchal) ఔటర్ రింగ్ రోడ్డు(ORR)పై ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటు చేసుకుంది.

ORR Accident : ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్ : మేడ్చల్(Medchal) ఔటర్ రింగ్ రోడ్డు(ORR)పై ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు స్పాట్ లోనే ప్రాణాలు వదిలారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడట్టు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర(Keesara) పరిధిలోని ఓఆర్ఆర్ పై బీదర్ నుంచి హైదరాబాద్ వస్తున్న కారు.. ఓ భారీ కంటైనర్ ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు సీట్లో కూర్చున్న యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. వెనుక సీట్లో కూర్చున్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే గాయపడిన వారిలో మరొకరి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టు వైద్యుల సమాచారం. అయితే ఈ ఘటనలో మరణించిన ఇద్దరు.. హైదరాబాద్ లోని మేడిపల్లికి చెందిన యశ్వంత్, బోడుప్పల్ కు చెందిన చార్లెస్ గా పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.

Next Story