- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర రోడ్డు ప్రమాదం: కాలువలో పడిన కారు.. ఐదుగురు మృతి
హైవేపై వెళ్తున్న కారు అదుపుతప్పి కాలువలో పడిపోవడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: హైవేపై వెళ్తున్న కారు అదుపుతప్పి కాలువలో పడిపోవడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ (Lakhimpur Kheri) జిల్లాలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ధఖేర్వా గిరిజా పూరి హైవేపై వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి కాలువలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. అలాగే మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక యంత్రాంగం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
ఈ రోడ్డు ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని, అలాగే సహాయక చర్యలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం (UP CMO) ద్వారా ఆయన స్థానిక యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ విషాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.






