రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు దుర్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-13 15:31:38  IST  )

రోడ్డు ప్రమాదంలో ఒకే కుంటుబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన మెదక్ జిల్లా పరిధిలో ఇవాళ రాత్రి చోటుచేసుకుంది.

రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు దుర్మరణం
X

దిశ, పెద్ద శంకరంపేట/వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో స్పాట్‌లోనే నలుగురు దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన మెదక్ (Medak) జిల్లా పెద్ద శంకరంపేట (Pedda Shankarampet) మండల పరిధిలో ఇవాళ రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగీ గ్రామానికి చెందిన లింగమయ్య, సాయమ్మ, సాయిలు, మానసలు పంచాయతీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు బైక్‌పై స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వారి బైక్ కోలపల్లి గ్రామ శివారులోకి రాగానే గుర్తు తెలియని ఓ వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు తీవ్ర గాయాలతో రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయి తీవ్ర గాయాలతో స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు పెద్ద శంకరంపేట పీఎస్ పరిధిలోని ఎస్సై ప్రవీణ్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు వారు కేసు నమోదు చేసుకుని మృతుల కుటుంబాలకు సమాచారం అందజేసే పనిలో నిమగ్నమయ్యారు.

Next Story