రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు కూలీలు దుర్మరణం

by Kema Shiva Kumar |

రోడ్డు ప్రమాదం (Road Accident)లో నలుగురు కూలీలు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.

రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు కూలీలు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో నలుగురు కూలీలు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆత్మకూరు (Athmakur) మండల పరిధిలోని ఏఎస్ పేట క్రాస్ రోడ్డు వద్ద ఆటోను ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఆత్మకూరు పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వారు వెల్లడించారు. అయితే, కూలీలంతా వెంకటరావుపల్లి (Venkatraopally) నుంచి తెల్లపాడు (Tellapadu)కు పొగాకు గ్రేడింగ్‌ చేసేందుకు ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Next Story