రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు స్పాట్ డెడ్

by Kema Shiva Kumar |

రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో ఇవాళ మధ్యహ్నం చోటచేసుకుంది.

రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో ఇవాళ మధ్యహ్నం చోటచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మొయిన్‌పురి (Moinpuri)లోని ఫరుఖాబాద్ (Farrukhabad) రహదారిపై వెళ్తున్న ఓ కారును ఎదురుగా వస్తున్న ట్రక్ బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న ఓకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన స్పాట్‌ను పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించి మృతుల బంధువులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన ట్రక్ డ్రైవర్‌ను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story