- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. రాష్ట్రానికి చెందిన అయ్యప్ప భక్తులు మృతి
రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఏకంగా ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతిచెందిన విషాద ఘటన తమిళనాడు (Tamilnadu) రాష్ట్రంలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఏకంగా ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతిచెందిన విషాద ఘటన తమిళనాడు (Tamilnadu) రాష్ట్రంలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కారులో అయ్యప్ప భక్తులు శబరిమల నుంచి రామేశ్వరం (Rameswaram) వెళ్తుండగా రామనాథపురం (Ramanathapuram) వద్ద కారును రోడ్డు పక్కన ఆపి నిద్రిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ లారీ అతివేగంతో వచ్చి కారును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మొత్తం నలుగురు అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురిని ఏపీలోని విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోరపు కొత్తవలస వాసులుగా, మరొకరిని గజపతినగరం మండలం మరుపల్లి వాసిగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన మరో నలుగురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.






