- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర రోడ్డు ప్రమాదం.. కారు-స్కూటర్ ఢీ.. మామ, అల్లుడు మృతి
దిశ, పెబ్బేరు : కారు-స్కూటర్ ఢీ కొనడంతో మామ, అల్లుడు మృతి చెందిన సంఘటన పెబ్బేరు మండల పరిధిలోని చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగాపురం గ్రామానికి

దిశ, పెబ్బేరు : కారు-స్కూటర్ ఢీ కొనడంతో మామ, అల్లుడు మృతి చెందిన సంఘటన పెబ్బేరు మండల పరిధిలోని చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగాపురం గ్రామానికి చెందిన ఎద్దుల రమేష్ (50) అల్లుడు కొల్లాపూర్ కు చెందిన ప్రవీణ్ (32) వీరిద్దరూ కలిసి రంగాపురం నుంచి పెబ్బేరుకు బైక్ పై వస్తుండగా.. బైపాస్ దగ్గర హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. మృతుడు ఎద్దుల రమేష్ కు భార్య లక్ష్మీ, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లకు వివాహం జరిగింది. అల్లుడు మృతుడు మొదటి కుమార్తె భర్త ప్రవీణ్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య అలివేల ఒకే రోజు తండ్రి, భర్త చనిపోవడంతో తల్లి కూతుర్లు ఇద్దరు, కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. రంగాపురం లో విషాదఛాయలు చోటు చేసుకున్నాయి. పెబ్బేరు ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు.






