మౌంట్ ఒపేరా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే యువతి దుర్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-30 04:37:07  IST  )

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరోకరు ప్రాణాలు కోల్పోయిన ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ (Abdullapurmet) పరిధిలోని ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

మౌంట్ ఒపేరా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే యువతి దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరోకరు ప్రాణాలు కోల్పోయిన ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ (Abdullapurmet) పరిధిలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు యువతీయువకులు హోండా యాక్టివా వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో మౌంట్ ఒపేరా (Mount Opera) వద్దకు రాగానే వారి వాహనాన్ని మరో యాక్టివా ఢీకొట్టడంతో బండి పైన ఉన్న యువతి లారీ చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయింది. యువకుడు ఎగిరి ఫుట్‌పాత్‌పై పడిపోగా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా యువతిని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story