ఘోర ప్రమాదం: కొండను ఢీకొన్న విమానం..

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-20 11:10:57  IST  )

ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఒక ప్రైవేట్ విమానం (చార్టర్డ్ ప్లేన్) ఘోర ప్రమాదానికి గురైంది.

ఘోర ప్రమాదం: కొండను ఢీకొన్న విమానం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఒక ప్రైవేట్ విమానం (చార్టర్డ్ ప్లేన్) ఘోర ప్రమాదానికి గురైంది. జిల్లాలోని ఆరా కొండల (Ara Hills) ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఈ విమానం కుప్పకూలింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఈ ప్రైవేట్ జెట్ విమానం ఆరా కొండల వద్ద అటవీ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా అదుపుతప్పి ఒక పెద్ద చెట్టును ఢీకొట్టింది. అనంతరం సమీపంలోని కొండను ఢీకొట్టి కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానంలో మంటలు చెలరేగి, ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఈ ఘటనలో పైలట్, కో-పైలట్ మరణించి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే, విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, ప్రాణనష్టం ఎంత అనే దానిపై ఇంకా అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. ఘటనా స్థలం నుండి వెలువడుతున్న దృశ్యాల్లో విమాన శిథిలాలు మంటల్లో చిక్కుకుని ఉండటాన్ని చూడవచ్చు.

సహాయక చర్యలు..

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, జిల్లా యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అటవీ ప్రాంతం, కొండ ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడుతోంది. విమానం ఎక్కడి నుండి బయలుదేరింది, ఎక్కడికి వెళుతోంది అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

గాల్లో మూడు గంటల నరకం.. ప్రాణ భయంతో ప్రయాణికుల హాహాకారాలు, ప్రార్థనలు

Next Story