బొగ్గు గనిలో ఘోర ప్రమాదం.. భారీ పేలుడుతో 82 మంది కార్మికులు మృతి!

by Malleboina Mahesh |

చైనాలోని బొగ్గు గనిలో కార్బన్ మోనాక్సైడ్ లీకై భారీ పేలుడు సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో 82 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

బొగ్గు గనిలో ఘోర ప్రమాదం.. భారీ పేలుడుతో 82 మంది కార్మికులు మృతి!
X

దిశ, వెబ్ డెస్క్: బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించి 82 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన మధ్య చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లో ఒక బొగ్గు గని (Coal mine)లో చోటు చేసుకుంది. బీజింగ్‌కు నైరుతి దిశలో సుమారు 520 కిలోమీటర్ల (320 మైళ్ల) దూరంలో ఉన్న కిన్యువాన్ కౌంటీలో, శుక్రవారం రాత్రి గని నుంచి కార్బన్ మోనాక్సైడ్ హెచ్చరిక జారీ అయిన తర్వాత ఈ గ్యాస్ పేలుడు సంభవించిందని స్థానిక ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా నివేదించింది.

పేలుడు జరిగిన సమయంలో భూగర్భంలో 247 మంది కార్మికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన రెస్క్యూ టీమ్స్ శ్రమించి 165 మంది కార్మికులను సురక్షితంగా తీసుకురాగలిగారు. అయితే గనిలో చాలా లోతున ఇరుక్కుపోయిన మిగిలిన 82 మంది కార్మికులు విషవాయువు పీల్చడం,పేలుడు తీవ్రత కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి.

Next Story