జనగామ ‘శక్తి డెయిరీ’లో ఘోర ప్రమాదం.. ఓవెన్ పేలి నలుగురికి తీవ్ర గాయాలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-25 15:59:54  IST  )

జనగామ జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. శక్తి డెయిరీలో బాదాం మిల్క్ ఓవెన్ పేలి నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

జనగామ ‘శక్తి డెయిరీ’లో ఘోర ప్రమాదం.. ఓవెన్ పేలి నలుగురికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: జనగామ (Jangaon) జిల్లాలోని శక్తి డెయిరీ (Shakti Dairy)లో భారీ పేలుడు సంభవించింది. బాదాం మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ (Almond Milk Processing Unit) వద్ద ఓవెన్ ఒక్కసారిగా పేలిపోవడంతో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే, బాదాం మిల్క్ బాటిళ్లను వేడి చేసే ఓవెన్ (Oven) పూర్తిగా చల్లారకముందే కార్మికులు దానిని తెరవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. లోపల హెవీ ప్రెషర్ ఉండటంతో ఓవెన్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది.

పేలుడు ధాటికి అక్కడే ఉన్న వందలాది బాదాం మిల్క్ సీసాలు ముక్కలయ్యాయి. ఆ గాజు ముక్కలు వేగంగా వచ్చి కార్మికులకు గుచ్చుకోవడంతో వారికి తీవ్ర రక్తస్రావమైంది. ఈ మేరకు గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురు కార్మికులను మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. డెయిరీలో భద్రతా నిబంధనల పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story