- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nagarkurnool: ఫైనాన్స్ ఏజెంట్ల వేధింపులతో ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు
ఫైనాన్స్ కంపెనీలు (Finance companys) లోన్ ఇచ్చేటప్పుడు ఎంత తియ్యగా మాట్లాడతాయో లోన్ తీసుకున్న తరవాత రికవరీ సమయంలో అంతే దురుసుగా ప్రవర్తిస్తాయి.

దిశ, వెబ్ డెస్క్: ఫైనాన్స్ కంపెనీలు (Finance companys) లోన్ ఇచ్చేటప్పుడు ఎంత తియ్యగా మాట్లాడతాయో లోన్ తీసుకున్న తరవాత రికవరీ సమయంలో అంతే దురుసుగా ప్రవర్తిస్తాయి. ఒకటి రెండు రోజులు వెయిట్ చేయాలని కోరినా వినకుండా వేధింపులకు గురి చేస్తుంటాయి. దీంతో వినియోగదారులు ఫ్రస్టేషన్ తట్టుకోలేక ఆగ్రహంతో ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదు. తాజాగా ఓ వ్యక్తి ఫైనాన్స్ కంపెనీ వేధింపులు భరించలేక ట్రాక్టర్ కు నిప్పు పెట్టాడు.
ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా (Nagarkurnool) తిమ్మాజిపేట్ మండలం చేగుంట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గడ్డం రవి ఫైనాన్స్ లో ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. రెండేళ్ల క్రితం ట్రాక్టర్ కొనుగోలు చేయగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి రూ.98వేలు చొప్పున ఈఎంఐ కడుతున్నాడు. అయితే ఈ నెల డబ్బులు లేకపోవడంతో రూ.80వేలు కట్టి మిగితా డబ్బును కొద్దిరోజుల తరవాత కడతానని చెప్పాడు.
కానీ ఏజెంట్ వినకుండా రూ.18వేల కోసం ఇంటికి వెళ్లి వేధించడం మొదలు పెట్టాడు. దీంతో ఏజెంట్ తనను దూషించి పరువు తీశాడు అంటూ రైతు రవి తన ట్రాక్టర్‌కు పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. దీంతో ట్రాక్టర్ కాలిపోయింది. అచ్చం ఇలాంటి ఘటనే ఇటీవల సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. బైక్ ఈఎంఐ కట్టలేదని వేధింపులకు గురి చేయడంతో ఓ యువకుడు బైక్ ను తగలబెట్టాడు. ఫైనాన్స్ కంపెనీల ఒత్తిడితో ఏజెంట్లు వినియోగదారుల పట్ల దురుసుగా వ్యవహరించడంతో తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.






