- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ షాక్‌తో రైతు మృతి
by Bhanu |
విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన విషాద ఘటన మల్హర్ మండలం తాడిచెర్ల లో శుక్రవారం ఉదయం జరిగింది.

X
దిశ, మల్హర్: విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన విషాద ఘటన మల్హర్ మండలం తాడిచెర్ల లో శుక్రవారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన ఆకుల ఓదెలు (68) అనే రైతు తన స్వంత చేనులో కూరగాయలు పంట సాగు చేశాడు. కూరగాయల పంటను ధ్వంసం చేయడానికి స్థానిక ఊర పందులు, కోతులు వస్తుండగా వాటి బెడద వల్ల విద్యుత్ తీగను చేను చుట్టూ అమర్చి పంటను రక్షణ కవచంగా మార్చాడు.
రోజు మాదిరిగా సాయంత్రం విద్యుత్ తగిలించి ఉదయమే తొలగిస్తుండేవాడు అకస్మాత్తుగా ఏమైందో కానీ అదే తీగలను తగిలి అక్కడికక్కడే ఓదెలు మృత్యు ఒడిలో పడి ఉన్నాడు. అటుగా వెళ్తున్న గ్రామస్తులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన ప్రదేశానికి చేరుకున్న కొయ్యూరు పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.
Next Story






