- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేజ్ విల్ ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి
by Bhanu |
వర్షాలు కురుస్తున్న సమయంలో పొలంలో నాటు వేసేందుకు ముందుగా కేజ్ విల్ ట్రాక్టర్ తో పొలంను దున్నతున్న ప్రమాదవశాత్తు

X
దిశ, ఉట్నూర్ : వర్షాలు కురుస్తున్న సమయంలో పొలంలో నాటు వేసేందుకు ముందుగా కేజ్ విల్ ట్రాక్టర్ తో పొలంను దున్నతున్న ప్రమాదవశాత్తు ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం కడెం మండలంలోని అల్లంపల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కడెం మండలంలోని అల్లంపల్లిలో మంగళ్ సింగ్ తండా కు రావుసే(48) గ్రామానికి చెందిన వేరొక రైతు పొలంలో నాటు వేసేందుకు ముందుగా కేజ్ విల్ ట్రాక్టర్ తో దున్నేందుకు వెళ్ళాడు.
ప్రమాదవశాత్తు కేజ్ విల్ ట్రాక్టర్ బోల్తా పడింది. సంఘటన స్థలంలోలోనే రావుసే మృతి చెందాడు. ట్రాక్టర్ బోల్తా పడిన విషయం చుట్టుపక్కల రైతులు, స్థానికులు వచ్చి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. అందరితో కలివిడిగా ఉండే మృతుడు వ్యవసాయ పనులకు వెళ్లి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు.
Next Story






