- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తీవ్ర విషాదం.. చెరువులో మునిగి కాడెద్దులతో సహా రైతు మృతి
by Gantepaka Srikanth |
చెరువులో మునిగి కాడెద్దులతో సహా రైతు మృతి

X
దిశ, వెబ్‌డెస్క్: జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెరువులో మునిగి కాడెద్దులతో సహా రైతు మృతి(Farmer Dead)చెందారు. నంద్యాల(Nandyal) జిల్లా రుద్రవరం మండలం ఆలమూరు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం చెరువులో కాడెద్దులను కడగటానికి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఎద్దులు నీట మునిగాయి. వాటిని కాపాడటానికి వెళ్లి రైతు బాష కూడా మునిగిపోయాడు. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న పలువురు గమనించి వెలికి తీశారు. కానీ అప్పటికే ఎద్దులతో సహా బాష కూడా మృతిచెందారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






