- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చికిత్స పొందుతూ రైతు మృతి..
by Batti.Sumithra |
చికిత్స పొందుతూ రైతు మృతి చెందిన సంఘటన నర్సాపూర్ మండలంలో చోటుచేసుకుంది.

X
దిశ, నర్సాపూర్ : చికిత్స పొందుతూ రైతు మృతి చెందిన సంఘటన నర్సాపూర్ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే నరసాపూర్ మండల పరిధిలోని తుజాల్పూర్ గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల కృష్ణ (40) గత కొంతకాలంగా అప్పుల బాధతో తీవ్రఇబ్బందులు పడుతున్నాడు. జీతం పై విరక్తి పెంచుకున్న కృష్ణ గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
గమనించిన కుటుంబీకులు కృష్ణను హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. చికిత్స పొందుతూ కృష్ణ ఆదివారం మృతి చెందాడు. మృతునికి భార్య సత్యమ్మతో పాటు కూతురు కొడుకు ఉన్నాడు. అయితే నెలరోజుల కిందటే అతని కూతురు వివాహం చేయడంతో అప్పులు ఎక్కువయ్యాయి. కృష్ణమూర్తి మృతితొ గ్రామంలో తీవ్రవిషాదఛాయలు అమ్ముకున్నాయి.
Next Story






