హైద‌రాబాద్‌లో హృద‌య విదార‌క‌ర ఘ‌ట‌న.. అంత్యక్రియలకు డబ్బుల్లేక మూడు రోజులు మృత‌దేహంతోనే

by Ajay Maddhiboyina |

హైద‌రాబాద్‌లో హృద‌య విదార‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. అంత్య‌క్రియ‌ల‌కు డబ్బులు లేక మృత‌దేహంలోనే ఓ కుటుంబం మూడు రోజులు గ‌డిపింది.

హైద‌రాబాద్‌లో హృద‌య విదార‌క‌ర ఘ‌ట‌న.. అంత్యక్రియలకు డబ్బుల్లేక మూడు రోజులు మృత‌దేహంతోనే
X

దిశ‌, వెబ్ డెస్క్: హైద‌రాబాద్‌లో హృద‌య విదార‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. అంత్య‌క్రియ‌ల‌కు డబ్బులు లేక మృత‌దేహంలోనే ఓ కుటుంబం మూడు రోజులు గ‌డిపింది. ఈ ఘ‌ట‌న జీడిమెట్ల పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని షాపూర్ స‌మీపంలోని ఎన్ఎల్‌బీనగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ కు చెందిన స్వామిదాస్(76) త‌న కుటుంబంతో క‌లిసి ఎన్ఎల్‌బీనగర్ లో ఉంటున్నాడు. కాగా స్వామిదాస్ కొద్దిరోజులుగా అనారోగ్యానికి గుర‌వ్వ‌డంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది.

ప్రైవేట్ ఆస్ప‌త్రిలో న‌ర్సుగా ప‌నిచేస్తూ కుటుంబాన్నిపోషించే స్వామి దాస్ చిన్న‌కుమార్తె తండ్రి అనారోగ్యం కార‌ణంగా ఉద్యోగం మానేయ‌డంతో ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారింది. ఇక మూడు రోజుల క్రితం స్వామిదాస్ మ‌ర‌ణించ‌గా అంత్య‌క్రియ‌ల‌కు డ‌బ్బులు లేక కుటుంబ స‌భ్యులు మూడు రోజుల పాటు ఇంట్లోనే పెట్టుకున్నారు. మూడు రోజులుగా ఎవ‌రూ బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో ఇంటి య‌జ‌మాని పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వ‌చ్చి ఓ స్వ‌చ్ఛంద సంస్థ స‌హాయంతో అంత్య‌క్రియ‌లు నిర్వహించారు.

Next Story