యూపీలో ఘోరం.. అంబులెన్స్‌‌లోని డెడ్ బాడీని రోడ్డుపై ప‌డేసిన కుటుంబ స‌భ్యులు

by Ajay Maddhiboyina |

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం చోటు చేసుకుంది. యూపీలోని గోండాలో హృదయ్ లాల్ (24) యువ‌కుడు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించాడు.

యూపీలో ఘోరం.. అంబులెన్స్‌‌లోని డెడ్ బాడీని రోడ్డుపై ప‌డేసిన కుటుంబ స‌భ్యులు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం చోటు చేసుకుంది. యూపీలోని గోండాలో హృదయ్ లాల్ (24) యువ‌కుడు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించాడు. ఆగ‌స్టు 1న మృతుడికి మ‌రో వ్య‌క్తికి ఆర్థిక లావాదేవీల‌కు సంబంధించి గొడ‌వ జ‌రిగింది. ఈ క్ర‌మంలో దాడి చేయ‌డంతో తీవ్ర‌గాయాల‌పాలైన హృదయ్ లాల్ ను ఆస్ప‌త్రిలో చేర్పించ‌గా చికిత్స పొందుతూ మ‌ర‌ణించాడు.

కాగా అత‌డి కుటుంబ స‌భ్య‌లు గోండా నుండి డెడ్ బాడీని అంబులెన్స్ లో తీసుకెళుతుండ‌గా గోండా-లక్నో హైవేFamily Of Deceased Man Throw His Body From Moving Ambulance To Block Roadపై ట్రాఫిక్‌ను అడ్డుకుని నిర‌స‌న తెలిపేందుకు అంబులెన్స్ నుండి రోడ్డు మ‌ధ్య‌లో ప‌డేశారు. దీంతో వెంట‌నే పోలీసులు వారిని అడ్డుకుని డెడ్ బాడీని అక్క‌డ నుండి త‌ర‌లించారు. రోడ్డు పై మృతదేహాన్ని ప‌డేసిన వ్య‌క్తుల‌పై కేసు న‌మోదు చేశారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. అంబులెన్స్ లో ఉన్న డెడ్ బాడీని అందులోని వ్య‌క్తి డోర్ ఓపెన్ చేసి కింద ప‌డ‌వేసే స‌న్నివేశాలు క‌నిపిస్తున్నాయి. యూపీలో ఇలాంటి దారుణాలు కామ‌న్ అంటూ నెటిజ‌న్లు ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. video

Next Story