ప్రియుడి మోజులో పడి సంసారం బుగ్గి.. సుపారీ ఇచ్చి భర్తను చంపించిన భార్య

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-16 05:41:57  IST  )

హనుమకొండ జిల్లా పరకాలలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను సుపారీ ఇచ్చి చంపించిన భార్య ఉదంతం కలకలం రేపింది.

ప్రియుడి మోజులో పడి సంసారం బుగ్గి.. సుపారీ ఇచ్చి భర్తను చంపించిన భార్య
X

దిశ, వెబ్‌డెస్క్: వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తన సుఖానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ భార్య, ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు సుపారీ ఇచ్చింది. నిందితులు అతి కిరాతకంగా ఆ వ్యక్తిని చంపి, ఆధారాలు దొరకకుండా పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన హనుమకొండ (Hanmakonda) జిల్లా తాడ్వాయి (Tadwai)లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. సుమన్ (Suman), లావణ్య (Lavanya) దంపతులకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. కొంతకాలం వరకు వీరి సంసారం సాఫీగానే సాగింది. ఈ క్రమంలోనే లావణ్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్త సుమన్‌కు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ప్రియుడితో కలిసి ఉండటానికి భర్త అడ్డుగా ఉన్నాడని లావణ్య భావించింది.

సుపారీ గ్యాంగ్‌తో హత్య..

ఎలాగైనా.. భర్తను వదిలించుకోవడానికి లావణ్య తన ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. ఇందుకోసం ఒక ముఠాకు సుపారీ ఇచ్చింది. పక్కా పథకం ప్రకారం సుమన్‌ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితులు, మొదట బీరు సీసాలతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. హత్య చేసిన తర్వాత ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు, సుమన్ మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లావణ్య ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆమెను తమదైన శైలిలో విచారించగా, ప్రియుడితో కలిసి భర్తను చంపించినట్లుగా ఒప్పుకుంది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తును ఆలోచించకుండా లావణ్య చేసిన ఈ ఘాతుకంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story