- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లాలో తీవ్ర విషాదం.. కుటుంబం ఆత్మహత్య ?
by Naga Rani Yarlagadda |
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన తీవ్ర విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన తీవ్ర విషాద ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. జియ్యమ్మవలస మండలం వనజ గ్రామానికి చెందిన కుటుంబం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులు మీనాక మధు (35), భార్య సత్యవతి (30), కూతురు మోస్య (4)గా గుర్తించారు. మరో కూతురు కొన ఊపిరితో ఉండగా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా.. మధు - సత్యవతిల మధ్య జరిగిన గొడవ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా స్థానికులు చెప్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. వారి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
Next Story






