- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జస్టిస్ మాధవీదేవిపై అసత్య ఆరోపణలు.. నిందితుడు దామోదర్ అరెస్ట్
బండి సాయి భగీరథ్ పోక్సో కేసు బెయిల్ విచారణ నేపథ్యంలో న్యాయమూర్తి జస్టిస్ టి.మాధవీదేవిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: న్యాయమూర్తులపై సోషల్ మీడియా (Social Media) వేదికగా అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదంటూ పోలీసులు కొరడా ఝుళిపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడు సాయి భగీరథ్‌కు సంబంధించిన పోక్సో కేసు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మాధవీదేవి (T. Madhavi Devi)ని లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేసిన దామోదర్ (Damoder) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బండి సంజయ్ కొడుకుకు బెయిల్ మంజూరు చేస్తే, సదరు న్యాయమూర్తి భర్తకు ప్రభుత్వ చైర్మన్ పదవి దక్కుతుందంటూ దామోదర్ నెట్టింట అసత్య ఆరోపణలు ప్రచారం చేశాడు. ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థ ప్రతిష్టను మసకబారేలా ఉన్న ఈ పోస్టులపై హైకోర్టు రిజిస్ట్రార్ బీఎస్ చిరంజీవి చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు దామోదర్‌ను అదుపులోకి తీసుకున్నారు.






