- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Falcon Scam: ఫాల్కన్ స్కాంపై ఈడీ కేసు నమోదు.. సంచలన విషయం వెలుగులోకి
ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ (Falcon Invoice Discount) పేరుతో వేల మందిని మోసం చేసిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) దర్యాప్తును వేగవంతం చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ (Falcon Invoice Discount) పేరుతో వేల మందిని మోసం చేసిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ మేరకు ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టును కూడా నమోదు చేసింది. నగరంలోని హైటెక్ సిటీ (High-tech City) హుడా ఎన్‌క్లేవ్ (Huda Enclave) కేంద్రంగా ఫాల్కన్ సంస్థ ఇన్వాయిస్ డిస్కౌంట్ల పేరుతో అధిక లాభాలు ఆశ చూపి సుమారు రూ.1,700 కోట్ల మేర వసూలు చేసింది. అయితే, సంస్థ నిర్వాహకులు దుబాయ్ (Dubai), మలేషియా (Malaysia) సహా మొత్తం 14 షెల్ కంపెనీలకు రూ.850 కోట్లు మళ్లించినట్లుగా సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (Cyberabad Economic Offenses Wing) కూడా(ఈవోడబ్ల్యూ) నిర్ధారించింది.
మొత్తం 19 మందిపై కూడా కేసులు నమోదయ్యాయి. ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వైస్ చైర్మన్ పవన్ కుమార్ (Pavan Kumar), డైరెక్టర్ కావ్య (Kavya), ఎగ్జిక్యూటివ్ మేనేజర్ అనంత (Anantha)ను ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ప్రధాన నిందితులైన ఫాల్కన్ డైరెక్టర్ అమర్‌దీప్ కుమార్ (Amardeep Kumar), సీఏవో ఆర్యన్ సింగ్ (Aryan Singh), సీఈవో యోగేందర్ సింగ్ (Yogender Singh)లు దుబాయ్ (Dubai)కి పరారయ్యారు. విచారణలో భాగంగా ఈడీ (ED) విదేశాల్లో ఉన్న ఫాల్కన్ షెల్ కంపెనీలకు క్రిప్టో కరెన్సీ, హవాలా రూపంలో మళ్లించిన నిధుల వివరాలను సేకరిస్తోంది.
కాగా, ఇన్వాయిస్ డిస్కౌంట్స్ (Invoice Discounts) ఆఫర్ పేరుతో నాలుగేళ్లుగా ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ (Falcon Capital Ventures Private Limited Company) రాష్ట్ర వ్యాప్తంగా 6,979 మంది డిపాజిటర్ల నుంచి రూ.1,700 కోట్లు వసూలు చేసింది. ఏడాదికి 11 నుంచి 22 శాతం రిటర్న్ ఇస్తామని అందరినీ నమ్మించి నట్టేట ముంచేశారు. దర్యాప్తులో భాగంగా ఈడీ కేసుకు సంబంధం ఉన్న వ్యక్తుల ఇళ్లల్లో రెండు లేదా మూడు రోజుల్లో సోదాలు చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది.






