రూ.729 కోట్ల భారీ స్కాం.. కంపెనీ CEO అరెస్ట్

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-06 17:32:56  IST  )

ఫాల్కన్ కంపెనీ స్కాంలో ఆ కంపెనీ సీఈఓను మంగళవారం సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.

రూ.729 కోట్ల భారీ స్కాం.. కంపెనీ CEO అరెస్ట్
X

దిశ, సిటీ క్రైం: ఫాల్కన్ కంపెనీ స్కాంలో ఆ కంపెనీ సీఈఓను మంగళవారం సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐడీ పోలీసుల వివరాల ప్రకారం... క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కంపెనీ ఎండీ అమరదీప్, మరికొంత మందితో కలిసి ఫాల్కన్ డిస్కౌంట్ అప్లికేషన్‌ను రూపొందించాడు. ఈ అప్లికేషన్ ద్వారా ఫేక్ డీల్స్‌ను సృష్టించి ఈ కంపెనీలో డిపాజిట్ చేసిన వారికి అధిక వడ్డీలతో లాభాలు ఇస్తామని ప్రచారం చేశారు. ఇలా మొత్తం 4065 మంది డిపాజిటర్‌ల నుంచి రూ.729 కోట్లు కాజేశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు సైబరాబాద్‌లో కంప్లైంట్ చేశారు. కేసు దర్యాప్తులో వేగం పెంచిన అధికారులు కంపెనీ సీఈవో పాత్ర ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే సీఈఓ యోగేందర్ శర్మ దుబాయ్ పారిపోయాడు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చాడనే విషయం తెలుసుకున్నారు. పక్కా సమాచారంతో సీఐడీ అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.

Next Story