ఫాల్కన్ కుంభకోణంలో మరో ఇద్దరు అరెస్ట్

by Ajay Maddhiboyina |

ఫాల్కన్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. అధిక లాభాల ఆశ చూపి 7056 మందిని మోసం చేసి సుమారు 4,215 కోట్ల కుంభ‌కోణానికి పాల్ప‌డ్డారు.

ఫాల్కన్ కుంభకోణంలో మరో ఇద్దరు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఫాల్కన్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. అధిక లాభాల ఆశ చూపి 7056 మందిని మోసం చేసి సుమారు 4,215 కోట్ల కుంభ‌కోణానికి పాల్ప‌డ్డారు. ఈ కేసులో ప్ర‌ధాన నింధితుడు యోగేద్ర సింగ్‌ను ఇప్పటికే అరెస్ట్ చేయగా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ పవన్ ఓదెల, డైరెక్టర్ కావ్య నల్లూరి రిమాండ్ లో ఉన్నారు. తాజాగా తెలంగాణ సీఐడీ మరో ఇద్దరు నింధితులను అరెస్ట్ చేసింది. రబీంద్ర ప్రసాద్, సుష్మా రాజ్ అనే ఇద్దరిని బీహార్‌లో అదుపులోకి తీసుకుంది. తరవాత వారిని హైదరాబాద్ తీసుకువచ్చి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచింది. అరెస్ట్ అయిన ఇద్దరు నింధితులు ఈ కేసులో ఏ 2గా ఉన్న అమర్‌దీప్ దీప్ కుటుంబ సభ్యులు చురుగ్గా వ్యవహరించారని అధికారులు వెల్లడించారు.

Next Story