- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నకిలీ వీసా కలకలం.. పోలీసుల అదుపులో నిందితుడు
శంషాబాద్ విమానాశ్రయంలో నకిలీ వీసాతో విదేశాలకు చెక్కేద్దామనుకున్న వ్యక్తిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి నకిలీ వీసాతో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించగా అతడిని చాకచక్యంగా పట్టుకున్నారు. విమానాశ్రయంలోని ఇంటర్నేషనల్ డిపార్చర్స్‌కు వెళ్లే దారిలో ఉన్న ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద అధికారులు డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తుండగా ప్రయాణికుడు నకిలీ వీసా (Fake Visa)తో యూఏఈ (UAE)లోని రసూల్‌కైమా వెళ్లేందుకు విమానం ఎక్కేందుకు ప్రయత్నించాడు. అయితే, అతని వీసా పత్రాలను కంప్యూటర్ సిస్టమ్‌లో ఇమ్మిగ్రేషన్ అధికారులు నిశితంగా తనిఖీ చేయగా అవి పక్కా ఫోర్జరీ చేసిన నకిలీ పత్రాలని తేలింది. ఈ మేరకు అతడిని వెంటనే అదుపులోకి తీసుకుని ప్రాథమికంగా విచారించి చట్టపరమైన చర్యల నిమిత్తం నిందితుడిని శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు.






