ట్యాంక్ బండ్‌ థ్రిల్లర్ కథ.! స్టోరీ వాళ్లదే.. కానీ ఎండ్ కార్డ్ పోలీసులది

by Bhanu |

17 లక్షల రూపాయాలను చూడగానే ఓ యువకుడి బుద్ధి క్షణాల్లో మారిపోయింది. ఆ డబ్బును కొట్టేసేందుకు ట్యాంక్ బండ్ పై దోపీడీ జరిగిందని కట్టు కథ సృష్టించాడు. గాయలు కావడానికి తానే బైక్ ను స్కిడ్ చేసుకున్నాడు.

ట్యాంక్ బండ్‌ థ్రిల్లర్ కథ.! స్టోరీ వాళ్లదే.. కానీ ఎండ్ కార్డ్ పోలీసులది
X

దిశ, సిటీక్రైం : 17 లక్షల రూపాయాలను చూడగానే ఓ యువకుడి బుద్ధి క్షణాల్లో మారిపోయింది. ఆ డబ్బును కొట్టేసేందుకు ట్యాంక్ బండ్ పై దోపీడీ జరిగిందని కట్టు కథ సృష్టించాడు. గాయలు కావడానికి తానే బైక్ ను స్కిడ్ చేసుకున్నాడు.కింద పడిపోయినప్పుడు డబ్బు ను ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని పోలీసు ఫిర్యాదుతో నమ్మించాడు. దర్యాప్తులో సీసీ కెమెరాలను పరిశీలించినప్పుడు యువకుడి డ్రామా బయటపడింది. చివరకు నిజం ఒప్పుకోవడంతో యువకుడితో పాటు అతనికి సహాకరించిన మరో యువకుడు జైలు పాలైయ్యారు.

సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ మలక్ పేట్ ప్రాంతానికి చెందిన జతిన్ యాదవ్, సౌదా అభిలాస్ స్నేహితులు. జతిన్ రాజ్ యాదవ్ మన్ భావనా చిట్ ఫండ్స్ లో కలెక్షన్ ఏజెంట్ గా పన చేస్తున్నాడు. బుధవారం చిట్ ఫండ్ యజామని గోపాల్ తపారియా జూబ్లీహిల్స్ లోని ప్రకాష్ అగర్వాల్ దగ్గర చిట్టి డబ్బులకు సంబంధించి 17 లక్షల రూపాయాలను తీసుకురావాలని సాయంత్రం 6 గంటలకు పంపించాడు.

జతిన్ రాజ్ యాదవ్ 7 గంటల ప్రాంతంలో ప్రకాష్ అగర్వాల్ దగ్గర నగదును తీసుకుని బైక్ పై బయలు దేరాడు. భారీ నగదును చూడగానే బుద్ధి మార్చుకున్న జతిన్ నేరుగా మలక్ పేట్ వెళ్ళాడు. అక్కడ నగదును పెట్టాడు. అందులో నుంచి 2.50 లక్షల రూపాయాలను స్నేహితుడు అభిలాష్ కు ఇచ్చాడు. తిరిగి ట్యాంక్ బండ్ పై కి వచ్చి తన బైక్ ను స్కిడ్ చేసుకున్నాడు. తాను అనుకున్నట్లు కాకుండా వాహనం కిందపడడంతో జతిన్ కు తలకు గాయాలయ్యాయి. అక్కడి నుంచి జతిన్ రాజ్ యాదవ్ గాంధీ ఆసుపత్రికి వెళ్ళాడు. ఇంతలో జతిన్ ఇంకా రాలేదని ఫోన్ చేస్తే అది స్విచ్ ఆఫ్ రావడంతో గోపాల్ తాపరియా జతిన్ తండ్రికి ఫోన్ చేశాడు. అప్పుడు అతను జతిన్ కు రోడ్డు ప్రమాదం జరిగిందని , కిందపడినప్పుడు డబ్బులు ఎవరో ఎత్తుకెళ్ళారని వివరించాడు.

దీంతో గోపాల్ తపారియా జతిన్ ను చూసేందుకు ఆసుపత్రికి వెళ్ళి ఆ తర్వాత జతిన్ ను తీసుకుని దోమలగూడ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందగానే దోమలగూడ పోలీసులు రంగంలోకి దిగి వాహనం స్కిడ్ అయ్యిందని చెప్పిన ప్రాంతంలో సీసీ కెమెరాలను పరిశీలించారు. అప్పుడు పోలీసులకు జతిన్ చెప్పుతున్న దాంట్లో కొంత అనుమానాస్పదంగా ఉందని భావించి జతిన్ ను విచారించారు. దీంతో జతిన్ ఆ డబ్బులను తాను కొట్టేయాలని ప్లాన్ తోనే తాను ఈ సీన్ క్రియేట్ చేశానని చెప్పి డబ్బులు తన ఇంట్లో ఉన్నాయని, మరో 2.50 లక్షలు తన స్నేహితుడి దగ్గర ఉన్నాయని చెప్పాడు. పోలీసులు మొత్తం 17 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దర్ని అరెస్టు చేశారు.

Next Story