కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నకిలీ పోలీస్.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వద్ద రూ.2.82 లక్షలు వసూలు

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌(Police Command Control Center)లో గుర్తుతెలియని వ్యక్తి కలకలం రేపాడు.

కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నకిలీ పోలీస్.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వద్ద రూ.2.82 లక్షలు వసూలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌(Police Command Control Center)లో గుర్తుతెలియని వ్యక్తి కలకలం రేపాడు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి టాస్క్ ఫోర్స్ పోలీసునంటూ మూడు సార్లు వచ్చి వెళ్ళి.. ఓ వ్యక్తి వద్ద రూ.2.82 లక్షలు కాజేశాడు. వివరాల్లోకి వెళితే.. నిందితుడు ఐసీసీసీకి ఎదురుగా ఉన్న నిలోఫర్ కేఫ్‌లో కూకట్ పల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ జ్ఞానసాయి ప్రసాద్ అనే వ్యక్తిని కలిసి, తాను టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ హరిజన గోవర్ధన్ అని నమ్మించాడు. హోటల్ వ్యాపారంలో లాభాలు ఉంటాయని చెప్పి జ్ఞానసాయి ప్రసాద్ దగ్గర రూ.2.82 లక్షలు వసూలు చేశాడు.

దుంగడుగు తన ముందు పలుమార్లు ఐసీసీసీ(ICCC) నుండి బయటకు రావడంతో, అతను నిజంగానే టాస్క్ ఫోర్స్ అధికారి అని జ్ఞానసాయి ప్రసాద్ నమ్మి మోసపోయాడు. అసలు నిజం తెలిశాక బాధితుడు బంజారాహిల్స్ పోలీసు(Banjara Hills Police)లకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో పాటు అనేకమంది మంత్రులు కీలక సమావేశాలు ఏర్పాటు చేసుకునే ప్రాంగణంలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించడం, భద్రతా వలయం మధ్య ఉండే ఐసీసీసీలోకి దుండగుడు వెళ్లడంపై భద్రతా వ్యవస్థకు అవమానం అని విమర్శలు వస్తున్నాయి.

కాగా, ఇటీవల తెలంగాణ సెక్రటేరియట్‌(Secretariat)లోకి నాలుగు సార్లు నకిలీ ఉద్యోగుల పేరిట గుర్తు తెలియని వ్యక్తులు రావడం ఘటనలు మరువక ముందే అత్యంత ప్రతిష్టాత్మకమైన, కట్టుదిట్టమైన భద్రత ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ అంటూ మూడు సార్లు వచ్చి వెళ్ళిన దుండగుడి వ్యవహారం కలకలం రేపుతోంది.

Next Story