- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.100 కోట్ల విలువ చేసే ప్లాట్లకు నకిలీ డాక్యుమెంట్లు
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు, అధికారులు చే పట్టిన దర్మాప్తు అమాయక బాధితు ల్లో ఆనందాన్ని నింపుతున్నది.

ఈ ఎస్ఆర్ఓ మామూలోడు కాదు..
l షాక్ అవుతున్న పోలీసులు
l స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు పోలీసుల లేఖ
l ఇప్పటివరకు 20కి పైగా ఫేక్ డాక్యుమెంట్ కేసులు
l 84 మంది అరెస్టు..
l రూ.100 కోట్ల విలువ చేసే ప్లాట్లకు నకిలీ డాక్యుమెంట్లు
l కీసర పోలీసుల దర్మాప్తులో సంచలన విషయాలు
దిశ, సిటీక్రైం : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు, అధికారులు చే పట్టిన దర్మాప్తు అమాయక బాధితు ల్లో ఆనందాన్ని నింపుతున్నది. పోలీ సులు చేసిన ఇన్వెస్టిగేషన్ తో డబుల్ రిజిస్ట్రేషన్ సమస్యకు చట్టపరమైన దారి దొరకడంతో బాధితులు ఖుషీ లో మునిగిపోతున్నారు. ఆరు నెల లుగా ఈ పోలీస్ స్టేషన్ అధికారులు చేపట్టిన ఫేక్ డాక్యుమెంట్ ఫిర్యా దుల విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నా యి. ఈ ఫేక్ డాక్యుమెంట్‌లన్నీ 2016 నుంచి ఎనిమిదేండ్ల పాటు కీసర సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన అధికారి సమయంలోనే రిజిస్ట్రేషన్లు జరిగాయని పోలీసులు ప్రాథమిక ఆ ధారాలను సేకరించారు.
ఈ ఎస్ఆ ర్ఓ సమయంలోనే చాలా మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, కొంత మం ది డాక్యుమెంట్ రైటర్లు, ఇతర బ్రో కర్‌లు ఖాళీ స్థలాలను గుర్తించి వా టికి నకిలీ పేపర్‌లను రూపొందించి ఎస్ఆర్ఓతో పాటు మిగతా సిబ్బందికి భారీగా లంచాలు ఇచ్చి డబుల్ రిజిస్ట్రేషన్లు చేసేశారని ఇప్పటి వరకు అరెస్టైన నిందితుల విచారణలో బ యటపడింది. ఈ నకిలీ పేపర్ లతో రిజిస్టర్ చేసుకున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లు, ఇతర అక్రమ వ్యాపా రులు ఒరిజినల్ పత్రాలు ఉన్న స్థల యజమానులను ఇబ్బందులకు గురి చేయడంతో పాటు కోర్టులలో కౌం టర్ పిటిషన్‌లను దాఖలు చేసి పరే షాన్ చేశారు. సెటిల్మెంట్ కు వచ్చే లా బెదరించారు. ఇలా ఇబ్బందుల కు గురైన బాధితులు కొంత మంది పోలీసులను ఆశ్రయించడంతో వారు పక్కగా దర్యాప్తు చేయడంతో ఏమిదేండ్లుగా కీసర్ ఎస్ఆర్ఓగా పనిచేసిన అధికారి సమయంలోనే ఈ భాగోతం నడిచిందని పోలీసులు తేల్చారు. ఇలా కీసర పోలీసులు ఈ టైం లో జరిగిన ఫేక్ పేపర్స్ తో జ రిగిన రిజిస్ట్రేషన్‌లపై 20 కిపైగా కేసులను నమోదు చేశారు. వీటిలో 84 మందిని అరెస్టు చేశారు. పో లీసులు దర్యాప్తు చేసిన డబుల్ రిజిస్ట్రేషన్ స్థలాల విలువ ఓపెన్ మార్కె ట్‌లో రూ.100 కోట్లు పైబడి ఉం టుందని తెలిసింది.
డబుల్ రిజిస్ట్రేషన్‌లపై ఫిర్యాదు చేయండి
కీసర ఎస్ఆర్ఓ రహ్మాన్ పని చేసిన ఎనిమిది ఏండ్ల సమయంలోనే నకిలీ పత్రాలతో డబుల్ రిజిస్ట్రేషన్ లు భారీగా జరిగాయని మా దర్యాప్తులో తేలింది. ఇప్పటి వరకు 20కి పైగా కేసులను నమోదు చే శాం. ఎస్ఆర్ఓ రహ్మన్ అరె స్టుకు సంబంధించి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కు లేఖ రాస్తున్నాం. అనుమతి రాగానే అదుపులోకి తీసుకుని విచారి స్తాం. డబుల్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి బాధితులు ఎ వరైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
- చక్రపాణి,
జవహర్ నగర్ ఏసీపీ






