- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫేక్ సర్టిఫికెట్ల తయారీ ముఠా గుట్టురట్టు.. ఐదుగురు నిందితులు అరెస్ట్
ఉన్నత విద్యకు సంబంధించి ఫేక్ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ముఠాను రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఉన్నత విద్యకు సంబంధించి ఫేక్ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ముఠాను రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్సింగిలోని చింతచెట్టు ప్రాంతంలో పహారా ఏర్పాటు చేసి, నకిలీ సర్టిఫికెట్లను కస్టమర్లకు ఇచ్చేందుకు వచ్చిన ఐదుగురు వ్యక్తులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఎస్‌ఓటీ దాడిలో నిందితుల వద్ద ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, బెంగళూరు సిటీ యూనివర్సిటీ పేరిట నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు, బోనఫైడ్ సర్టిఫికెట్లు, ఇతర నకిలీ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ సర్టిఫికెట్ల తయారీతో పాటు ప్రింటింగ్, విక్రయం వంటి పనులు చేస్తున్నట్లు నిందితులు ప్రాథమిక విచారణలో ఒప్పుకున్నారు. పట్టుబడిన ముఠా పదో తరగతి సర్టిఫికెట్‌కు రూ.50 వేలు, ఇంటర్మీడియట్‌కు రూ.75 వేలు, డిగ్రీ సర్టిఫికెట్‌కు రూ.1.20 లక్షలు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితులను రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ పోలీసులు నార్సింగి పోలీసులకు అప్పగించడంతో, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.






