- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినిమా స్టైల్లో ‘నకిలీ సీబీఐ’ రెయిడ్: కట్ చేస్తే.. నిందితులకు మైండ్‌బ్లాంక్!
నకిలీ సీబీఐ అధికారుల ముసుగులో రూ.25 లక్షలు దోచుకున్న ముఠా పోలీసులు పట్టేశారు.

దిశ, వెబ్‌డెస్క్: సీబీఐ అధికారులమంటూ సూటు, బూటు వేసుకుని డబ్బు ఉన్నోళ్లింటికి వెళ్లి ఫేక్ రెయిడ్స్ చేసి దోచేసిన సీన్లు మనం సినిమాల్లోనే చూశాం. కానీ, అచ్చం అలాంటి ఘటనే తాజాగా మహారాష్ట్ర (Maharashtra)లోని అకోలా (Akola) జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖామ్‌గావ్ (Khamgaon) ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల వృద్ధ వ్యాపారి ఒకరు వ్యాపార నిమిత్తం తన వద్ద రూ.25 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను తీసుకుని బాలాపూర్ బస్టాండ్‌లో బస్సు ఎక్కుతుండగా ఇద్దరు వ్యక్తులు ఆయనను అడ్డుకున్నారు. గూగుల్ సహాయంతో తాము తయారుచేసిన నకిలీ సీబీఐ (CBI) గుర్తింపు కార్డును ఆ వృద్ధుడికి చూపించారు. తాము సీబీఐ అధికారులమని, ఆ వ్యాపారి అక్రమ ఆర్థిక లావాదేవీలు, హవాలా నెట్‌వర్క్‌తో లింకును ఉన్నాయంటూ బెదరించారు. అనంతరం విచారణ జరపాలని, ఆ వృద్ధుడి మొబైల్ ఫోన్‌తో పాటు రూ.25 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను లాక్కుని అక్కడి నుంచి క్షణాల్లో బైక్‌పై పరారయ్యారు.
రంగంలోకి దిగిన పోలీసులు..
అయితే, బాధితుడు బాధితుడు వెంటనే బాలాపూర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో, అకోలా ఎస్పీ నేతృత్వంలో లోకల్ క్రైమ్ బ్రాంచ్ (LCB) టీమ్ రంగంలోకి దిగింది. నిందితులు పారిపోయిన రూట్లో 50కి పైగా సీసీటీవీ (CCTV) కెమెరాల ఫుటేజీలను పోలీసులు నిశితంగా పరిశీలించారు. వారి బైక్ నంబర్, మొబైల్ లొకేషన్ ఆధారంగా నిందితులను గుర్తించారు. కేవలం 12 గంటల్లోనే దోపిడీకి పాల్పడిన నిందితులను హార్దిక్ మనోజ్ కుమార్ గుర్బానీ (22), సాహిల్ నందకిషోర్ నత్థానీ (25)లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 25 లక్షల నగదును, నకిలీ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అయితే, పోలీసుల ప్రాథమిక విచారణలో ఓ షాకింగ్ నిజం బయటపడింది. నిందితుల్లో ఒకరైన హార్దిక్ మనోజ్ కుమార్ గతంలో అదే వృద్ధ వ్యాపారి వద్ద పనిచేశాడని, పక్కాగా సీబీఐ రెయిడ్ స్కెచ్ వేసి దొచేసినట్లుగా పోలీసులు వెల్లడించారు.






