- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి
వివాహేతర సంబంధం నేపథ్యంలో తలెత్తిన గొడవలు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.

దిశ, మర్పల్లి: వివాహేతర సంబంధం నేపథ్యంలో తలెత్తిన గొడవలు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. వ్యవసాయ పనులకని వెళ్లిన ఓ రైతు దారుణ హత్యకు గురైన సంఘటన వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిధిలోని బిల్కల్ గ్రామంలో చోటుచేసుకుంది. మృతుడి భార్య వసంత తెలిపిన వివరాల ప్రకారం.. మర్పల్లి మండలం బిల్కల్ గ్రామానికి చెందిన చేరాల నర్సింలు (39) తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య వసంత, ఇద్దరు కుమారులు సాయికృష్ణ, శ్రీహరి గౌడ్ ఉన్నారు. అయితే, గత కొన్నేళ్లుగా నర్సింలుకు అదే గ్రామానికి చెందిన బండారి నర్సమ్మతో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయంపై కుటుంబంలో తరచూ గొడవలు జరిగేవి. గత రెండు, మూడు నెలల నుండి నర్సింలు సదరు మహిళకు దూరంగా ఉంటున్నాడు. అయితే నర్సమ్మ మాత్రం నర్సింలుకు, అతని భార్య వసంతకు ఫోన్ చేసి "నీ భర్త నాకు కావాలి, అడ్డు వస్తే నిన్ను చంపైనా అతనితో ఉంటాను" అని బెదిరింపులకు పాల్పడినట్లు వసంత తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దినచర్యలో భాగంగా గురువారం రాత్రి సుమారు 7:30 - 8:00 గంటల సమయంలో నర్సింలు తన జొన్న చేను వద్దకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయలుదేరాడు. మరుసటి రోజు ఉదయం 8 గంటలైనా భర్త ఇంటికి రాకపోవడంతో వసంత ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. కొద్దిసేపటికే వారి బంధువు రాములు ద్వారా ఊరి శివారులోని మేదరి చంద్రయ్యకు చెందిన సర్వే నెంబర్ 166లో నర్సింలు శవమై పడి ఉన్నాడని సమాచారం అందింది. ఘటనా స్థలానికి వెళ్లి చూడగా నర్సింలు ముఖంపై, తల వెనుక భాగంలో రాళ్ళతో మోదినట్లుగా తీవ్ర గాయాలై రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. తన భర్తను బండారి నర్సమ్మ, ఆమె భర్త పాపయ్య కలిసి పథకం ప్రకారం రాళ్ళతో కొట్టి చంపారని మృతుడి భార్య వసంత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ మేరకు మర్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






