ఫార్మా కంపెనీలో పేలుడు.. ఇద్దరు మృతి

by Disha Web Desk 12 |
ఫార్మా కంపెనీలో పేలుడు.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని వల్సాద్‌లో ఉన్న వెన్‌పెట్రోకెమ్ & ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కాగా ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో బయటకొచ్చాయి. "మేము అగ్నిమాపక చర్యను ప్రారంభించలేము, ఏ రసాయనం అక్కడ ఉందో మాకు ఖచ్చితంగా తెలియదు" అని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. అగ్నిమాపక చర్యను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారి తెలిపారు.

Next Story