మొయినాబాద్ ఫామ్‌హౌజ్‌లో అత్యంత ఖరీదైన మద్యం.. చేవెళ్ల DCP కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో మొయినాబాద్‌‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.

మొయినాబాద్ ఫామ్‌హౌజ్‌లో అత్యంత ఖరీదైన మద్యం.. చేవెళ్ల DCP కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో మొయినాబాద్‌‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ పార్టీలో ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు ప్రముఖులు పాల్గొనటం, మరీ ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నిర్వహించడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈగల్ ఆపరేషన్‌ టీమ్‌‌లో 2 గ్రాముల కోకైన్‌, అత్యంత ఖరీదైన మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. మరోవైపు ఈ డ్రగ్స్ టెస్ట్‌లో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్‌యాదవ్‌కు నెగిటివ్ రాగా.. పైలట్‌ రోహిత్‌రెడ్డి సహా ఐదుగురికి కొకైన్‌ పాజిటివ్‌గా తేలింది. వారిని రోహిత్‌రెడ్డితో పాటు నమిత్ శర్మ, రితేష్‌ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్‌రెడ్డిగా పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిని ఇతర పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

ఫామ్‌హౌస్‌కు వెళ్లిన పోలీసులపై ఢిల్లీకి చెందిన నమిద్ శర్మ అనే వ్యక్తి కాల్పులు జరిపాడని.. నిందితుడిని అరెస్ట్ చేసి అతడిపై ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశామని చేవెళ్ల డీసీపీ యోగేష్‌ గౌతమ్‌ తెలిపారు. కాల్పులకు ఉపయోగించిన గన్‌తో పాటు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కాల్పులకు ఉపయోగించింది రితీష్‌రెడ్డికి చెందిన లైసెన్స్‌డ్ గన్‌గా పోలీసులు గుర్తించినట్లు పేర్కొన్నారు.

Next Story