TG: దూకుడు పెంచిన ఎక్సైజ్ అధికారులు.. వరుసగా కల్లు దుకాణాల లైసెన్సులు సీజ్

by Gantepaka Srikanth |

కూకట్‌పల్లి(Kukatpally) కల్తీ కల్లు ఘటనను రాష్ట్ర ఎక్సైజ్ అధికారులు(Excise Officials) సీరియస్‌గా తీసుకున్నారు.

TG: దూకుడు పెంచిన ఎక్సైజ్ అధికారులు.. వరుసగా కల్లు దుకాణాల లైసెన్సులు సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: కూకట్‌పల్లి(Kukatpally) కల్తీ కల్లు ఘటనను రాష్ట్ర ఎక్సైజ్ అధికారులు(Excise Officials) సీరియస్‌గా తీసుకున్నారు. ఐదు బృందాలుగా ఏర్పడి కల్తీ కల్లు ఘటనలో బాధితుల వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే కల్లు నమూనాలను రసాయన పరిశీలన కేంద్రాలకు పంపించారు. హెచ్‌ఎంటీ హిల్స్, సర్డార్ పటేల్ నగర్, హైదర్ నగర్ కల్లు దుకాణాల లైసెన్సులు సీజ్ చేశారు. నిర్వాహకులు కల్లులో అల్ఫాజోలమ్ కలుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నలుగురు నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు.

కాగా, కూకట్‌పల్లి కల్తీ కల్లు(Kalthi Kallu) ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందారు. మొత్తం 37 మంది అస్వస్థతకు గురయ్యారు. నిమ్స్‌ ఆసుపత్రిలో 31 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 27 మంది ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నలుగురికి డయాలసిస్‌ చేస్తున్నట్లు చెప్పారు.

Next Story