- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లికావడం లేదని ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
by Sridhar Babu |
ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటు చేసుకుంది.

X
దిశ,వీణవంక : ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మండలంలోని ఎలుబాక గ్రామానికి చెందిన బొల్లం దేవేందర్ రెడ్డి (27) హుజురాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో గత నాలుగు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాడు. తనకు పెళ్లి కావడం లేదని, పెళ్లి సంబంధాలు రాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడని, మృతుని తండ్రి సంపత్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తోట తిరుపతి తెలిపారు.
- Tags
- suicide
Next Story






