- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
52 ఏళ్లు వచ్చినా తగ్గేదేలే.. గ్లామర్ డోస్ పెంచేసి హాట్ లుక్స్‌తో నెట్టింట రచ్చ చేస్తున్న మలైకా అరోరా
ఒక ఈవెంట్‌కి పొట్టి డ్రెస్‌లో వచ్చి తన థైస్ షోతో హాట్ లుక్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచడంతో పాటు హీట్ పుట్టించారు.

దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా 52 ఏళ్ల వయసులోనూ తన ఫిట్‌నెస్, గ్లామర్‌తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఈ భామ, తాజాగా ఒక ఈవెంట్‌కి పొట్టి డ్రెస్‌లో వచ్చి తన థైస్ షోతో హాట్ లుక్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచడంతో పాటు హీట్ పుట్టించారు. ఈ ఈవెంట్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రెమో డిసౌజాతో కలిసి ఆమె ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే ఈ టైమ్‌లో అక్కడ జరిగిన ఒక సరదా సంఘటన ఇప్పుడు నెట్టింట తెగ నవ్వులు పూయిస్తోంది. మలైకా మీడియా ముందుకు వచ్చి ఫోటోగ్రాఫర్లకు ఫోజులిస్తుండగా, అదే దారిలో వెళ్తున్న ఒక పెద్దాయన అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక తీవ్రంగా కంగారు పడిపోయారు. ఒకవైపు కెమెరాల మెరుపులు, మరోవైపు మలైకా గ్లామర్ చూసి.. అసలు ముందుకు వెళ్లాలా లేక వెనక్కి తగ్గాలా అని తీవ్ర కన్ఫ్యూజన్‌కు గురయ్యారు.
అలా కాసేపు ఆలోచిస్తూ ముందుకు వెళ్తూ, మళ్లీ వెనక్కి తగ్గిపోయిన ఆయన తీరు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూసిన జనాలు అయ్యో పాపం తాత.. మలైకా అందం చూసి షాకై కంగారు పడిపోయినట్లున్నాడు! అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇదే వీడియోలో మరో ఆసక్తికర దృశ్యం కూడా కనిపిస్తుంది. రెమో డిసౌజా మలైకాని మాత్రమే సోలోగా ఫోటోలు తీసుకోమని కెమెరా ముందుకు నెట్టగా, ఆమె మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. ‘పర్లేదు.. నువ్వు కూడా ఫోటోలో ఉండాల్సిందే, ఇద్దరం కలిసే దిగుదాం" అని స్వీట్ స్మైల్‌తో పట్టుబట్టి మరీ ఆయనతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ క్యూట్ అండ్ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






