- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోయంబత్తూరులో ఎదురుకాల్పులు.. ముగ్గురు అత్యాచార నిందితులు అరెస్ట్
తమిళనాడు (Tamilnadu) రాష్ట్రం కోయంబత్తూరు (Coimbatore)లో నవంబర్ 2న అంతర్జాతీయ విమానాశ్రయం వెనుక బృందావన్ నగర్ ప్రాంతంలో 20 ఏళ్ల పీజీ విద్యార్థినిని ముగ్గురు వ్యక్తులు అపహరించి గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు (Tamilnadu) రాష్ట్రం కోయంబత్తూరు (Coimbatore)లో నవంబర్ 2న అంతర్జాతీయ విమానాశ్రయం వెనుక బృందావన్ నగర్ ప్రాంతంలో 20 ఏళ్ల పీజీ విద్యార్థినిని ముగ్గురు వ్యక్తులు అపహరించి గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో కోయంబత్తూరు పోలీసులు వెంటనే ఏడు స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసి శివగంగ ప్రాంతానికి నిందితులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు.
ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం నిందితులు తుడియాలూరుకు సమీపంలోని వలంకినార్‌లోని తేడియాలూరు ఆలయం సమీపంలో ఉన్నారని సమాచారం అందడంతో ఆలయాన్ని పోలీసులు చుట్టుముట్టారు. అయితే నిందితులు గుణ, కరుప్పసామి, కాలీశ్వరన్‌ను పట్టుకునేందుకు హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ ప్రయత్నించగా.. వారు కొడవలితో దాడి చేశారు. అనంతరం ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు వారి కాళ్లపై కాల్పులు జరిపి గాయాలు చేసి అదుపులోకి తీసుకున్నారు. కొడవలి దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ చంద్రశేఖర్‌తో పాటు నలుగురిని చికిత్స నిమిత్తం కోయంబత్తూరు మెడికల్ కాలేజీ హాస్పిటల్ (CMCH)కి తరలించారు. అయితే, ఇప్పటికే నిందితులపై హత్య, దోపిడీతో మొత్తం 5 కేసులో నిందితులుగా ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు.






