Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2025-01-21 04:29:12  IST  )

ఛత్తీస్‌ఘడ్‌ (Chhattisgarh)లోని మరోసారి కాల్పుల మోత మోగింది.

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్/భద్రాచలం: ఒడిశా- ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) సరిహద్దు అటవీ ప్రాంతంలో మరోసారి కాల్పుల మోత మోగింది. గిరియాబంద్ జిల్లా పరిధిలోని మెయిన్పురి సరిహద్దు ప్రాంతంలోని కులారి ఘాట్ అటవీ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజాము నుంచి గిరియాబంద్ డీఆర్‌జీ (Giriyaband DRG), ఒడిశా ఎస్‌వోజీ (Odisha SOG) దళాలు, 207 కోబ్రా బెటాలియన్ (207 Cobra Battalion), సీఆర్‌పీఎఫ్ (CRPF) సిబ్బంది సంయుక్తంగా కూబింగ్ ఆపరేషన్ (Cubing Operation) కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే వారికి మావోయిస్టులు ఎదరుపడగా.. ఇరు పక్షాలు ఫైర్ ఓపెన్ చేశాయి. ఈ భీకర ఎన్‌కౌంటర్‌లో మొత్తం 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఇద్దరు మహిళలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో భారీ ఎత్తున ఆయుధాలతో పాటు మృతదేహాలను కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా, నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. ఓ జవానుకు గాయాలయ్యాయి.

Next Story