విద్యుత్ ఉద్యోగి మృతి

by Nallavelli.Anjaneyulu |

విద్యుత్ ఉద్యోగి మృతి చెందిన సంఘ‌ట‌న క‌ల్వ‌కుర్తి ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. శుక్రవారం కల్వకుర్తి పట్టణంలోని ఝాన్సీ లక్ష్మి భాయ్ రోడ్ లో గల విద్యుత్ ఉద్యోగి గుండె నొప్పి తో మృతి చెందారు.

విద్యుత్ ఉద్యోగి మృతి
X

దిశ, కల్వకుర్తి : విద్యుత్ ఉద్యోగి మృతి చెందిన సంఘ‌ట‌న క‌ల్వ‌కుర్తి ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. శుక్రవారం కల్వకుర్తి పట్టణంలోని ఝాన్సీ లక్ష్మి భాయ్ రోడ్ లో గల విద్యుత్ ఉద్యోగి గుండె నొప్పి తో మృతి చెందారు. పట్టణానికి చెందిన తండోజు శివరాం వెల్డండ మండలంలోని విద్యుత్ శాఖ లో జూనియర్ లైన్ మెన్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా తీవ్ర ఆవేదనకు గురైన శివరాం(34) కు గుండె నొప్పి రావడంతో తన స్వగృహంలో మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు 7 సంవ‌త్స‌రాల‌ లోపు చిన్నారులు ఉన్నారని సమాచారం. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

Next Story