విద్యుత్ శాఖలో మరో అవినీతి తిమింగలం.. అక్రమాస్తులు చూసి నోరెళ్లబెట్టిన ఏసీబీ

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-16 13:05:03  IST  )

విద్యుత్ శాఖ(Electricity Department)లో మరో అధికారి అడ్డంగా దొరికిపోయారు.

విద్యుత్ శాఖలో మరో అవినీతి తిమింగలం.. అక్రమాస్తులు చూసి నోరెళ్లబెట్టిన ఏసీబీ
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యుత్ శాఖ(Electricity Department)లో మరో అధికారి అడ్డంగా దొరికిపోయారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్‌(ADE Ambedkar)ను మంగళవారం ఏసీబీ(ACB) అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ సోదాల్లో భారీగా అక్రమాస్తులను గుర్తించారు. అంబేద్కర్ ఇంట్లో ఏకంగా రూ.2.18 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు.. భారీగా బంగారం కూడా లభ్యమైనట్లు సమాచారం. శేరిలింగంపల్లి, గచ్చిబౌలిలో ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. బహిరంగ మార్కెట్ ఆ ఆస్తుల విలువ దాదాపు రూ.100 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఇదిలా ఉంటే ఆయన మొత్తం అక్రమ ఆస్తుల విలువ దాదాపు రూ.300 కోట్లు ఉంటుందని అనుమానిస్తున్నారు. దాడులు, అరెస్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అక్రమ ఆస్తుల వివరాలు :

= హైదరాబాద్‌లో ఆరు ఇంటి స్థలాలు

= నగర శివారులో ఫామ్‌హౌజ్‌

= పది ఎకరాల స్థలంలో కంపెనీ ఏర్పాటు

= మొత్తం రూ.300 కోట్ల అక్రమాస్తులు

= ఇంట్లో రూ.2.18 కోట్ల నగదు

= కిలోల చొప్పున బంగారం స్వాధీనం

Next Story