- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాన్స్‌ఫార్మర్ పక్కన మూత్రం పోస్తుండగా విద్యుత్ షాక్
ట్రాన్స్‌ఫార్మర్ పక్కన మూత్రం పోస్తుండగా విద్యుత్ షాక్

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో విద్యుత్ షాక్(Electric Shock)తో ఏడుగురు మృతిచెందిన ఘటన మరువకముందే రాష్ట్రంలో మరొకరు విద్యుత్ షాక్‌తో మృతిచెందారు. ఈ ఘటన సూర్యాపేట(Suryapet) జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ పక్కనున్న ట్రాన్స్ ఫార్మర్ పక్కన.. పట్టణానికి చెందిన దంతాల చక్రధర్(50) అనే వ్యక్తి మూత్రం పోశాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడిక్కడే మృతిచెందారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్న వేళ రోడ్ల మీద విద్యుత్ వైర్లు తెగిపడే అవకాశం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే విద్యుత్ శాఖ అప్రమత్తం చేసింది.






