- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిమ్స్ ఆస్పత్రి వద్ద ఎలక్ట్రిక్ బైక్‌లో మంటలు.. పూర్తిగా దగ్దమైన బైక్
ఎలక్ట్రికల్ బైక్స్‌లో ఎక్కువగా మంటలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పెట్రోల్ ఖర్చు తగ్గుతుందని, వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని చాలా మంది వీటిని కొనుగోలు చేస్తుంటే అగ్నిప్రమాదాలు జరగటం

దిశ, వెబ్ డెస్క్: ఎలక్ట్రికల్ బైక్స్‌లో ఎక్కువగా మంటలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పెట్రోల్ ఖర్చు తగ్గుతుందని, వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని చాలా మంది వీటిని కొనుగోలు చేస్తుంటే అగ్నిప్రమాదాలు జరగటం కొనుగోలు దారులను ఆందోళన పెట్టిస్తోంది. కొన్ని బైకుల్లో రోడ్డు పై వెళుతూ వెళుతూనే మంటలు చెలరేగుతుండగా మరికొన్ని చార్జింగ్ పెట్టినప్పుడు, కొన్ని బైకులు ఊరికే పార్క్ చేసిన సమయాల్లోనూ మంటలు చెలరేగి బూడిద అవుతున్నాయి.
తాజాగా హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రి వద్ద కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆస్పత్రి ఆవరణలో పార్క్ చేసిన ఎలక్ట్రిక్ బైకులో మంటలు చెలరేగాయి. కాసేపటికి అది పూర్తిగా మంటల్లో కాలిపోయింది. అయితే బైక్ ఓ పక్కన పార్క్ చేసి ఉండటం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. అదే పార్కింగ్ స్థలంలో చుట్టూ బైకులు ఉన్నప్పుడు జరిగితే పెను ప్రమాదం జరిగి ఉండేది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. VIDEO






