- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో దారుణం..బాలికను లైంగికంగా వేధించిన వృద్ధ ఉపాధ్యాయుడు
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. మచిలీపట్నంలో మైనర్ బాలికపై వృద్ధ ఉపాధ్యాయుడు తిక్కిసెట్టి నట దేవేంద్రరావు అలియాస్ నటరాజ్ మాస్టారు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. మచిలీపట్నంలో మైనర్ బాలికపై వృద్ధ ఉపాధ్యాయుడు తిక్కిసెట్టి నట దేవేంద్రరావు అలియాస్ నటరాజ్ మాస్టారు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలికను లైంగికంగా సహకరించాలని ఒత్తిడి చేశాడు. ఆ వేధింపులకు తాళలేక బాలిక ఆత్మహత్యయత్నం చేసింది. తల్లిదండ్రులు అప్రమత్తం అవ్వడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనపై బాలిక తల్లి దండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కేసు నమోదు చేసి పదిరోజులకు పైనే అవుతున్నా నింధితుడిని మాత్రం అదుపులోకి తీసుకోలేదు. నటరాజ్ మాస్టారుపై ఫోక్సో కేసు నమోదు చేసినప్పటికీ రాజీ కుదిర్చే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తోంది. నటరాజ్ మాస్టారు 1983 నుండి 1995 వరకు మచిలీపట్నం ప్రభుత్వ రాంజీ ఉన్నత పాఠశాలలో పీటీ మాస్టారుగా పనిచేశారు. అప్పట్లో కూడా ఆయన మహిళా టీచర్లను వేధించేవారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలికను వేధింపులకు గురి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. వృద్ధుడిపై కేసు నమోదు చేసుకుని విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.






