- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రాల చేస్తున్నాడనే అనుమానంతో వృద్ధుడి హత్య.. లోకేశ్వరం మండలంలో కలకలం
మంత్రాలు చేశాడనే అనుమానంతో ఓ వృద్ధుడిని బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేసిన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా లోకేశ్వరం మండలంలోని నగర్ గ్రామంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది.

దిశ, లోకేశ్వరం: మంత్రాలు చేశాడనే అనుమానంతో ఓ వృద్ధుడిని బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేసిన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా లోకేశ్వరం మండలంలోని నగర్ గ్రామంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం, నగర్ గ్రామానికి చెందిన గడ్డం పోసులు (వయస్సు 64) అనే వృద్ధుడిపై అదే గ్రామానికి చెందిన గడ్డం గంగాధర్, గడ్డం సాయిలు అనే ఇద్దరు వ్యక్తులు మాంత్రికుడు అనే అనుమానంతో దాడి చేసి హతమార్చారు.
పోసులు తాము అనారోగ్యానికి గురవడంలో మంత్రాలే కారణమని భావించిన వారు, అతనిపై బండరాయితో దాడి చేసి తలపై బలమైన గాయం చేసి అక్కడికక్కడే మృతి చెందేలా చేశారు. అయితే మృతుడు నిందితులకు బంధువు కావడం గమనార్హం. ఘటన జరిగిన వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా, లోకేశ్వరం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.






