ఉరి వేసుకుని వృద్ధుడు ఆత్మహత్య..

by Taduka Kalyani |   (  Updated:2026-07-05 13:11:02  IST  )

మంచిర్యాల జిల్లా లక్షెటిపేట మున్సిపాలిటీ పరిధిలోని మోదెల గ్రామానికి చెందిన తోట లక్ష్మయ్య (80) ఆదివారం గ్రామ శివారులోని తన వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.

ఉరి వేసుకుని వృద్ధుడు ఆత్మహత్య..
X

దిశ, లక్షెటిపేట: మంచిర్యాల జిల్లా లక్షెటిపేట మున్సిపాలిటీ పరిధిలోని మోదెల గ్రామానికి చెందిన తోట లక్ష్మయ్య (80) ఆదివారం గ్రామ శివారులోని తన వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఏఎస్ఐ సత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం, లక్ష్మయ్య భార్య మూడు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఆయనకు ఐదుగురు కుమారులు ఉండగా, వారందరూ వివాహం చేసుకుని వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. దీంతో లక్ష్మయ్య ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. వృద్ధాప్యంతో పాటు రక్తపోటు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్యులు సూచించిన మందులు వాడుతున్నట్లు తెలిపారు. ఆదివారం ఉదయం లక్ష్మయ్య తన వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందినట్లు పక్కనే ఉన్న రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్ఐ సత్తయ్య తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

Next Story